జాన్సన్ అండ్ జాన్సన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఓకే!

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకా ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రా జెనెకాల టీకాలను డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను ఆమోదించింది. ఈ జాబితాలో ఆమోదంతో రెగ్యులేటరీ వ్యవస్థలు పటిష్టంగా లేని దేశాలు ఈ టీకా పంపిణీకి సిద్ధమవ్వచ్చని సంకేతమిచ్చినట్టే. ఈ లిస్టింగ్‌లోని టీకాలు కోవాక్స్ ఫెసిలిటీ అందుబాటులోని దేశాలన్నింటిలీ జాన్సన్ అండ్ […]

Update: 2021-03-13 00:06 GMT

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకా ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ఫైజర్/బయోఎన్‌టెక్, ఆస్ట్రా జెనెకాల టీకాలను డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ టీకాను ఆమోదించింది. ఈ జాబితాలో ఆమోదంతో రెగ్యులేటరీ వ్యవస్థలు పటిష్టంగా లేని దేశాలు ఈ టీకా పంపిణీకి సిద్ధమవ్వచ్చని సంకేతమిచ్చినట్టే. ఈ లిస్టింగ్‌లోని టీకాలు కోవాక్స్ ఫెసిలిటీ అందుబాటులోని దేశాలన్నింటిలీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకా పంపిణీ చేయడానికి అనుమతి లభించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ లిస్టింగ్‌కు ఆమోదం తెలపడమంటే కొవాక్స్ ఈ టీకా పంపిణీకి అనుమతి పొందినట్టేనని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఈ టీకాకు అతిశీతల గిడ్డంగులు అవసరం లేనందున వెనుకబడిన దేశాల్లో పంపిణీకి జాన్సన్ జాన్సన్ వ్యాక్సిన్ ఉపయుక్తంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ అడ్వైజర్ బ్రూస్ ఆల్వార్డ్ వివరించారు.

గావి అలయెన్స్‌తో కలిసి కొవాక్స్ సేవలందించనుంది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన 500 మిలియన్ డోసుల సేకరించే ఒప్పందాన్ని కొవాక్స్ కుదుర్చుకుంది. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో టీకా పంపణీకి కొవాక్స్ ఫెసిలిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది చివరినాటికి మూడు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయడానికి జాన్సన్ అండ్ జాన్సన్ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్టు చీఫ్ సైంటిస్ట్ పాల్ స్టాఫెల్ వెల్లడించారు. శుక్రవారం జరిగిన క్వాడ్ సమ్మిట్‌లో భారత్‌లో టీకాల ఉత్పత్తికి అమెరికా సహకారం అందించడానికి అంగీకరించింది. ఈ సదస్సులో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్‌ ద్వారా ఉత్పత్తి చేసుకోవడానికి అమెరికా ప్రతిపాదించినట్టు తెలిసింది.

Tags:    

Similar News