టెస్ట్ క్రికెట్‌లో సంచలనం.. ఎలైట్ క్లబ్‌లోకి జో రూట్
దిశ, స్పోర్ట్స్: టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది జో రూట్ జోరు కొనసాగుతున్నది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న జో రూట్ టెస్ట్ మ్యాచ్‌లలో వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌లో ఆడాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ జో రూట్. యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు అడిలైడ్‌లో జరుగుతున్నది. మూడో రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236కు ఆలౌట్ అయ్యింది. కీలక […]
దిశ, స్పోర్ట్స్: టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది జో రూట్ జోరు కొనసాగుతున్నది. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న జో రూట్ టెస్ట్ మ్యాచ్‌లలో వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. అదే సమయంలో జట్టుకు అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్‌లో ఆడాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ జో రూట్. యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు అడిలైడ్‌లో జరుగుతున్నది. మూడో రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 236కు ఆలౌట్ అయ్యింది. కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ జో రూట్ 62 పరుగులతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో జో రూట్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన సునిల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, మైఖెల్ క్లార్క్ రికార్డులను అధిగమించాడు.
జో రూట్ ఈ ఏడాది మొత్తం 1606 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కాగా, మొత్తం టెస్టు చరిత్రలో ఓకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్ 2006లో 1788 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్ 1976లో 1710 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 2008లో 1656 పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత జో రూట్ ఉన్నాడు. ఇక ఆ తర్వాత స్థానాల్లో మైఖెల్ క్లార్క్ (1595), సచిన్ టెండుల్కర్ (1562), సునిల్ గవాస్కర్ (1555) ఉన్నారు. జో రూట్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌తో పాటు బాక్సింగ్ డే టెస్టును ఈ ఏడాదిలోనే ఆడనున్నాడు.దీంతో అతడికి అగ్రస్థానాని వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా, 2016లో కూడా జో రూట్ 1477 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.