వారానికి ఐదు సార్లు అది ఉండాల్సిందే.. లేదంటే నిద్రపట్టదంటూ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు 2001లో ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్ హీరోలందరి సరసన నటించిన ఆమె స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే కరీనా కపూర్ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీకి దూరం కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి తన పాపులారిటీ పెంచుకుంది.
గత ఏడాది కరీనా ‘సింగం అగైన్’ (Singam Again)మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. కానీ హిట్ సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు చాలా ఇష్టమైనది కిచిడి. నేను వారానికి ఐదు సార్లు నేను దానిని తింటాను. అది తినకూండా నాకు మంచిగ అనిపించదు. ముఖ్యంగా చెప్పాలంటే కిచిడి లేకుండా నిద్ర కూడా పట్టదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరీనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు.