AAI కార్గో లాజిస్టిక్స్లో 400 పోస్టులు
న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, 3 ఏళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, 3 ఏళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్స్) : 400
అర్హత: కనీసం 60 శాతం మార్కులు (ఎష్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం)తో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: మార్చి 19, 2023 నాటికి 27 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 34,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటరాక్షన్, సర్టిఫికెట్ల పరిశీలన ..ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరి తేదీ: మార్చి 19, 2023.
వెబ్సైట్: https://aaiclas.aero/career