12,828 ఉద్యోగాలు.. సొంత ఊరిలో పనిచేసే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే

దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్ సైకిల్ - 2023 నోటిఫికేషన్ వెలువడింది.

Update: 2023-05-22 11:47 GMT

దిశ, కెరీర్: దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్ సైకిల్ - 2023 నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరితేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 12,828

తెలంగాణలో ఖాళీలు: 96

ఆంధ్రప్రదేశ్ ఖాళీలు: 118

పోస్టు :

గ్రీమీణ డాక్ సేవక్స్ - బ్రాంచ్ పోస్టు మాస్టర్ /అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి)

కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు రూ. 12,000 నుంచి రూ. 29,380 ఉంటుంది.

ఏబీపీఎం పోస్టులకు రూ. 10 నుంచి రూ. 24, 470 వేతనం ఉంటుంది.

ఎంపిక: అభ్యర్థులు పదో తరగతిలో సాధించి మార్కుల ఆధారంగా మెరిట్ చూస్తారు.

అప్లికేషన్ ఫీజ: రూ. 100 ఫీజు చెల్లించాలి. (నోటిఫికేషన్‌లో సూచించిన రిజర్వేషన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: మే 22, 2023.

చివరితేదీ: జూన్ 11, 2023.

వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/

Tags:    

Similar News