ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 482 జాబ్స్
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్స్‌కు సంబంధించి మొత్తం 482 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. సదరన్ రీజియన్ పైప్‌లైన్స్-SRPL, వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-WRPL, నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్-NRPL, ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-ERPL, సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-SERPL ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమేనని సంస్థ తెలిపింది. మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, […]
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్స్‌కు సంబంధించి మొత్తం 482 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. సదరన్ రీజియన్ పైప్‌లైన్స్-SRPL, వెస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-WRPL, నార్తర్న్ రీజియన్ పైప్‌లైన్స్-NRPL, ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-ERPL, సౌత్ ఈస్టర్న్ రీజియన్ పైప్‌లైన్స్-SERPL ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమేనని సంస్థ తెలిపింది. మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లలో మూడేండ్ల ఫుల్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణులు అయిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని తెలిపిది. అప్లికేషన్లు ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు చేయడానికి 2020 నవంబర్ 22ను చివరి తేదీగా ప్రకటించింది. 2020 డిసెంబర్ 6న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ https://portal.mhrdnats.gov.in/ లో టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇక ట్రేడ్ అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పోర్టల్‌లో https://apprenticeshipindia.org/లో రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. అనంతరం అదే రిజిస్టర్ నెంబర్‌తో https://plis.indianoilpipelines.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని తెలిపింది. పూర్తి వివరాలను అదే వెబ్ సైట్ నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది.