తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్.?
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ సర్కార్‌పై పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్టు సమచారం. దీంతో తెలంగాణ నిరుద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ రానుంది. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జోన్ల వారీగా ఆర్థిక శాఖ గుర్తించినట్టు సమాచారం. రాష్ట్రంలో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే కాకుండా ప్రత్యక్ష నియామకాల భర్తీకి మొత్తం 49 వేల పోస్ట్‌లు ఖాళీగా […]
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ సర్కార్‌పై పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్టు సమచారం. దీంతో తెలంగాణ నిరుద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ రానుంది. అయితే, ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జోన్ల వారీగా ఆర్థిక శాఖ గుర్తించినట్టు సమాచారం.
రాష్ట్రంలో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలే కాకుండా ప్రత్యక్ష నియామకాల భర్తీకి మొత్తం 49 వేల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అంచనా వేసిందని పేర్కొంటున్నారు. దీంతో, ఆర్థిక శాఖ ఉద్యోగ నియామకాల ఫైలును సిద్ధం చేసి మంత్రివర్గం ఆమోదం కోసం పంపించినట్టు సమాచారం. ఈ ఉద్యోగాలు తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్(TSPSC), పోలీసు నియామక(TSLPRB), వైద్య, పంచాయతీ నియామక బోర్డుల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ పలు సమావేశాలు నిర్వహించి.. ఖాళీల గురించి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. దాదాపు అన్ని ఉద్యోగాలకు ఒకే సారి నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.