మార్కెట్లోకి ల్యాండ్ రోవర్ డిస్కవరీ మోడల్.. ధర ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) బుధవారం తన కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 88.06 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ మోడల్ సరికొత్త జనరేషన్ కోసం పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో, అత్యాధునిక ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-సీటర్‌తో లభిస్తుందని, అన్ని రకాల సౌకర్యాలను ఈ వాహనంలో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త డిస్కవరీ వేరియంట్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) బుధవారం తన కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 88.06 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ మోడల్ సరికొత్త జనరేషన్ కోసం పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో, అత్యాధునిక ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-సీటర్‌తో లభిస్తుందని, అన్ని రకాల సౌకర్యాలను ఈ వాహనంలో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. కొత్త డిస్కవరీ వేరియంట్ ల్యాండ్ రోవర్ ఇదివరకు ఉన్న వాహన సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని, విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది.
కుటుంబంతో ప్రయాణించడానికి, అడ్వెంచర్ ప్రయాణాలకు ఉత్తమైన ఎస్‌యూవీగా వినియోగదారులకు ఈ వాహనం ఉంటుందని’ జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూర్ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజ్ రొవర్ ఎవోక్ రూ. 59.04 లక్షల నుంచి, డిస్కవరీ స్పోర్ట్ రూ. 65.30 లక్షలు, డిఫెండర్ 110 రూ. 83.38 లక్షలు, రేంజ్ రోవర్ స్పోర్ట్ రూ. 91.27 లక్షలు, రేంజ్ రోవర్ రూ. 2.10 కోట్ల నుంచి లభిస్తాయని కంపెనీ వివరించింది. వీటితో పాటు కొత్త అప్‌డేటెడ్ డిస్కవరీ మోడల్ వాహనాన్ని దేశవ్యాప్తంగా తన 24 డీలర్‌షిప్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.