వేగవంతమైన 4జీ డౌన్‌లోడ్ నెట్‌వర్క్ అందించిన జియో!
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో రిలయన్స్ జియో వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌ను అందించినట్టు తెలుస్తోంది. 20.1 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో 4జీని అందించి జియో మొదటిస్థానంలో నిలిచింది. అప్‌లోడ్ విభాగంలో మాత్రం వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్ వేగవంతమైన నెట్‌వర్క్ అందించి అగ్రస్థానంలో ఉన్నట్టు ట్రాయ్ వెల్లడించింది. వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ 7 ఎంబీపీఎస్‌గా నమోదైంది. డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా 5.8 ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 5 ఎంబీపీస్‌గా నమోదయ్యాయి. వొడాఫోన్, […]
దిశ, వెబ్‌డెస్క్: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో రిలయన్స్ జియో వేగవంతమైన 4జీ నెట్‌వర్క్‌ను అందించినట్టు తెలుస్తోంది. 20.1 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో 4జీని అందించి జియో మొదటిస్థానంలో నిలిచింది. అప్‌లోడ్ విభాగంలో మాత్రం వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్ వేగవంతమైన నెట్‌వర్క్ అందించి అగ్రస్థానంలో ఉన్నట్టు ట్రాయ్ వెల్లడించింది. వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ 7 ఎంబీపీఎస్‌గా నమోదైంది. డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఐడియా 5.8 ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 5 ఎంబీపీస్‌గా నమోదయ్యాయి.
వొడాఫోన్, ఐడియా తమ మొబైల్ వ్యాపారాలను వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా విలీనం చేసినప్పటికీ ట్రాయ్ ఇరు సంస్థల నెట్‌వర్క్‌లను విడిగానే గణాంకాల్ను విడుదల చేస్తుంది. ఇక, అప్‌లోడ్ స్పీడ్‌ని పరిశీలిస్తే వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్‌తో మొదటిస్థానంలో ఉండగా, ఐడియా 6.1 ఎంబీపీస్ స్పీడ్‌తో రెండోస్థానంలో ఉంది. జియో 4.2 ఎంబీపీస్, ఎయిర్‌టెక్ 3.9 ఎంబీపీస్ వేగంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టు ట్రాయ్ వెల్లడించింది.