4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో జియో సెకనుకు 24.1ఎంజీబీఎస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇది అంతకుముందు నెలతో పోలిస్తే 10 శాతం పెరగ్గా, 4జీ డౌన్‌లోడ్ వేగంలో వొడాఫోన్ ఐడియా 8.9 శాతం, ఎయిర్‌టెల్ 5.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. సమీక్షించిన నెలలో 4జీ డేటా అప్‌లోడ్ […]

Update: 2021-12-14 08:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో జియో సెకనుకు 24.1ఎంజీబీఎస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇది అంతకుముందు నెలతో పోలిస్తే 10 శాతం పెరగ్గా, 4జీ డౌన్‌లోడ్ వేగంలో వొడాఫోన్ ఐడియా 8.9 శాతం, ఎయిర్‌టెల్ 5.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. సమీక్షించిన నెలలో 4జీ డేటా అప్‌లోడ్ వేగంలో 8ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ ఐడియా మొదటి స్థానాన్ని కొనసాగించగా, ఇది గత ఐదు నెలల్లోనే అత్యధికమని గణాంకాలు పేర్కొన్నాయి. రిలయన్స్ జియో 7.1 ఎంబీపీస్, ఎయిర్‌టెల్ 5.6 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఈ కంపెనీలు సైతం ఐదు నెలల గరిష్ఠ స్పీడ్‌ను సాధించాయి.

Tags:    

Similar News