30 రోజులు.. 60 మంది.. ఝార్ఖండ్‌లో యువతిపై గ్యాంగ్‌రేప్
దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆమెను నెల రోజులపాటు గదిలో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మంది కామాంధులు.. చిత్తకార్తె కుక్కల్లా ఆమె మీద పడి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లాలో చోటుచేసుకుంది ఈ ఘటన. వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్ లోని సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతిని అపహరించిన దుండగులు ఆమెను కందర్‌బేరా సమీపంలో […]
దిశ, వెబ్‌డెస్క్: ఝార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆమెను నెల రోజులపాటు గదిలో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మంది కామాంధులు.. చిత్తకార్తె కుక్కల్లా ఆమె మీద పడి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లాలో చోటుచేసుకుంది ఈ ఘటన.
వివరాలిలా ఉన్నాయి. ఝార్ఖండ్ లోని సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతిని అపహరించిన దుండగులు ఆమెను కందర్‌బేరా సమీపంలో ఉన్న పాతబడిన గ్యారేజీలో బంధించారు. అక్కడ ఆమెకు మత్తు మందులు ఇస్తూ రోజుకు పలువురి చొప్పున లైంగికదాడికి పాల్పడ్డారు. నెలరోజుల పాటు ఆ నరకకూపంలోనే ఉన్న ఆ యువతి.. టాయిలెట్‌కు వెళ్లి వస్తానని చెప్పి వారి చెర నుంచి తప్పించుకుంది.
అక్కడ్నుంచి తప్పించుకున్న ఆ యువతి.. సరాసరి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారికి జరిగిన దారుణాన్ని వివరించింది. అయితే నెలరోజుల పాటు ఆ నరకకూపంలో ఉన్నందున ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో పోలీసులు ఆ యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.