అమెజాన్ అదుర్స్.. ఒక్కరోజులో బెజోస్ ఆస్తి ఎంత పెరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు ఒక్కరేజే రూ. 97 వేల కోట్లు పెరిగాయి. దీంతో ఒక్కరోజులోనే అత్యధిక సంపదను ఆర్జించిన తొలి వ్యక్తిగా జెఫ్ బెజోస్ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్ మొత్తం సంపద 189.3 బిలియన్ డాలర్లు. 2020లో కేవలం ఆరు నెలల కాలంలో 74 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే అమెజాన్ […]
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా కారణంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ పెరగడంతో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తులు ఒక్కరేజే రూ. 97 వేల కోట్లు పెరిగాయి. దీంతో ఒక్కరోజులోనే అత్యధిక సంపదను ఆర్జించిన తొలి వ్యక్తిగా జెఫ్ బెజోస్ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న జెఫ్ బెజోస్ మొత్తం సంపద 189.3 బిలియన్ డాలర్లు. 2020లో కేవలం ఆరు నెలల కాలంలో 74 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే అమెజాన్ షేర్ 7.9 శాతం పెరిగింది. మొత్తంగా ఈ ఏడాది అమెజాన్ 73 శాతం వృద్ధిని సాధించింది. ఇక, జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ ఆస్తులు 4.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన వ్యక్తుల్లో 13వ స్థానానికి చేరుకున్నారు. కాగా, ప్రస్తుత సంవత్సరంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 15 బిలియన్ డాలర్లు పెరగ్గా, దేశీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆస్తులు 13.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్స్‌పై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో ఈరోజు అమెజాన్ షేర్లకు కొనుగోళ్ల మద్ధతు భారీగా లభించింది.