టీంఏ ప్రెసిడెంట్‌గా జయేష్ రంజన్ జయకేతనం
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ (టీంఏ)కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో జయేష్ రంజన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో తెలంగాణ ఒలంపిక్ అసోసియేష్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టనున్నారు.టీంఏ మాజీ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫెసర్ కె. రంగారావుపై పోటీ చేసిన జయేష్ రంజన్‌కు 46 ఓట్లు రాగా, ఆయనకు 33 ఓట్లు వచ్చాయి. కార్యదర్శి పదవి కోసం పోటీ చేసిన కె.జగదీశ్వర్ యాదవ్‌కు 41ఓట్లు రాగా అతని ప్రత్యర్థి […]
తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ (టీంఏ)కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో జయేష్ రంజన్ ప్యానెల్ గెలుపొందింది. దీంతో తెలంగాణ ఒలంపిక్ అసోసియేష్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టనున్నారు.టీంఏ మాజీ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫెసర్ కె. రంగారావుపై పోటీ చేసిన జయేష్ రంజన్‌కు 46 ఓట్లు రాగా, ఆయనకు 33 ఓట్లు వచ్చాయి. కార్యదర్శి పదవి కోసం పోటీ చేసిన కె.జగదీశ్వర్ యాదవ్‌కు 41ఓట్లు రాగా అతని ప్రత్యర్థి రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీపడగా వేణుగోపాల్ చారి 67 ఓట్లతో పదవిని దక్కించుకున్నారు. జాయింట్ సెక్రెటరీగా నార్మన్ ఇసాక్, ట్రెజరర్‌గా కె. మహేశ్వర్‌లు గెలుపొందారు.