ఈ లోకానికి ఇక సెలవు అంటూ నటి ఫోస్ట్
దిశ, వెబ్ డెస్క్: కన్నడ బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి జయశ్రీ రామయ్య ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కలవరానికి గురిచేసింది. ‘ఈ మానసిన ఒత్తిడికి, ఈ లోకానికి ఇక సెలవు. నేను వదిలేస్తున్నా’ అని బుధవారం ఉదయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది జయశ్రీ. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు, అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బంధువులు, స్నేహితులు నటికి ఒకటే ఫోన్లు, మెసేజ్ లు చేశారు. దీంతో మధ్యాహ్నం ఆపోస్ట్ ను సదరు […]
దిశ, వెబ్ డెస్క్: కన్నడ బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్, నటి జయశ్రీ రామయ్య ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కలవరానికి గురిచేసింది. ‘ఈ మానసిన ఒత్తిడికి, ఈ లోకానికి ఇక సెలవు. నేను వదిలేస్తున్నా’ అని బుధవారం ఉదయం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది జయశ్రీ. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు, అభిమానుల్లో ఆందోళన మొదలైంది. బంధువులు, స్నేహితులు నటికి ఒకటే ఫోన్లు, మెసేజ్ లు చేశారు. దీంతో మధ్యాహ్నం ఆపోస్ట్ ను సదరు నటి ఫేస్ బుక్ నుంచి తొలగించి.. నేను క్షేమంగానే ఉన్నా… లవ్ యూ ఆల్ మరో పోస్ట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై జయశ్రీ ఫ్రెండ్ నటి అద్వితి షెట్టి స్పందించింది. జయశ్రీ చాలా రోజుల నుంచి మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించింది. కుటుంబ కలహాలు ఉన్నాయని, తరచూ ఫోన్ నంబర్లు మార్చడం ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకోలేకపోతున్నట్లు పేర్కొంది.