2న అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్..
న్యూఢిల్లీ : టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు త్వరలోనే రానున్న తరుణంలో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 2న అన్ని రాష్ట్రాల్లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్యాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి గురువారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే రాష్ట్రాలన్నింటిలో డ్రైరన్ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రయల్ రన్‌లో పార్టిసిపెంట్లు డమ్మీ […]
న్యూఢిల్లీ : టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు త్వరలోనే రానున్న తరుణంలో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 2న అన్ని రాష్ట్రాల్లో కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్యాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి గురువారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ భేటీలోనే రాష్ట్రాలన్నింటిలో డ్రైరన్ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రయల్ రన్‌లో పార్టిసిపెంట్లు డమ్మీ వ్యాక్సిన్ తీసుకుంటారని, వ్యాక్సినేషన్ పూర్తి మెకానిజం సన్నద్ధతను పరిశీలిస్తారని సంబంధితవర్గాలు తెలిపాయి. డిసెంబర్ 28, 29న నాలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అసోం, గుజరాత్‌లలో విజయవంతంగా డ్రైరన్ నిర్వహించారు. నిర్వహణ పరంగా, ఐటీ ప్లాట్‌ఫామ్ ‘కొవిన్’ సాఫ్ట్ వేర్, వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణ విజయవంతంగా ముగిసిందని నాలుగు రాష్ట్రాలు తెలిపాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు రెండు మూడు రోజుల్లో వస్తాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో డ్రైరన్ నిర్వహించడం గమనార్హం.