వైసీపీ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? : పవన్ కల్యాణ్

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షాల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘వరదల బీభత్సం ఒకవైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజల […]

Update: 2021-11-21 04:21 GMT
Janasena chief Pawan Kalyan
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షాల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘వరదల బీభత్సం ఒకవైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే, ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ‘ఇసుక అమ్ముతాం’ అని ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా?’’ అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.

దేశ ప్రజలకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Tags:    

Similar News