‘జామియా’ ర్యాలీలో ఉద్రిక్తత

           పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సీటీ నుంచి పార్లమెంట్ వరకు తలపెట్టిన విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు ఓక్లా ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఆందోళనలను వర్సిటీలోనే కొనసాగించాలనీ, పార్లమెంట్‌ వరకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు వారించారు. దీంతో నిరసనకారులంతా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బారికేడ్ల నుంచి దూకేందుకు […]

Update: 2020-02-10 08:43 GMT

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సీటీ నుంచి పార్లమెంట్ వరకు తలపెట్టిన విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు ఓక్లా ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఆందోళనలను వర్సిటీలోనే కొనసాగించాలనీ, పార్లమెంట్‌ వరకు వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు వారించారు. దీంతో నిరసనకారులంతా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బారికేడ్ల నుంచి దూకేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.

Tags:    

Similar News