షెకావత్‌‌ను విచారించండి: జైపూర్ కోర్టు

జైపూర్: క్రెడిట్ సొసైటీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను విచారించాలని జైపూర్ సిటీ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సుమారు రూ.900కోట్ల విలువ చేసే సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం కేసులో షెఖావ‌త్‌తోపాటు ఆయ‌న భార్య కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదైన ఈ కేసును స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌(ఎస్ఓజీ) జైపూర్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో షెఖావ‌త్ పేరును […]

Update: 2020-07-23 10:14 GMT

జైపూర్: క్రెడిట్ సొసైటీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను విచారించాలని జైపూర్ సిటీ కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సుమారు రూ.900కోట్ల విలువ చేసే సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణం కేసులో షెఖావ‌త్‌తోపాటు ఆయ‌న భార్య కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆగస్టు 23న ఎఫ్ఐఆర్ నమోదైన ఈ కేసును స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌(ఎస్ఓజీ) జైపూర్ యూనిట్ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో షెఖావ‌త్ పేరును ఎస్‌వోజీ ప్ర‌స్తావించ‌లేదు. ఈ క్రమంలో దరఖాస్తుదారులు జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టును ఆశ్రయించడంతో సిటీ కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. కాగా, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో షెకావత్ పాల్గొన్నారని ఇప్ప‌టికే కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు లాగేందుకు మంత్రి చేప‌ట్టిన బేర‌సారాల ఆడియో క్లిప్‌ల‌పై ఎస్‌వోజీ నోటీసులూ జారీ చేసింది.

Tags:    

Similar News