అత్యాచార బాధితురాలికి జైలు శిక్ష

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో అత్యాచార బాధితురాలికి జైలు శిక్ష పడింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిందంటూ కోర్టు జైలు శిక్ష వేసింది. దీంతో బాధితురాలు షాక్‌కు గురైంది. వివరాళ్లోకి వెళితే.. బీహార్‌ అరారియా జిల్లాకు చెందిన 22 సంవత్సరాల యువతిపై కొంతమంది అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్టేట్‌మెంట్ కోసం బాధితురాలిని అరారియా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్ పై సంతకం పెట్టాలని తెలపడంతో వారితో […]

Update: 2020-07-16 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో అత్యాచార బాధితురాలికి జైలు శిక్ష పడింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిందంటూ కోర్టు జైలు శిక్ష వేసింది. దీంతో బాధితురాలు షాక్‌కు గురైంది. వివరాళ్లోకి వెళితే.. బీహార్‌ అరారియా జిల్లాకు చెందిన 22 సంవత్సరాల యువతిపై కొంతమంది అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్టేట్‌మెంట్ కోసం బాధితురాలిని అరారియా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

ఈ క్రమంలోనే యువతి ఇచ్చిన స్టేట్‌మెంట్ పై సంతకం పెట్టాలని తెలపడంతో వారితో విభేదించింది. తనతో వచ్చిన సోషల్‌ వర్కర్‌కు ఆ స్టేట్‌మెంట్ చూపిన తర్వాత సంతకం చేస్తాను అంటూ తేల్చి చెప్పింది. దీనికి మెజిస్ట్రేట్ కూడా నిరాకరించారు. ఇలా చేయడం చట్ట విరుద్ధమని గుర్తు చేశారు. అయినా ఆ యువతి సంతకం పెట్టకపోవడంతో విధులకు ఆటంకం కలుగజేశారని జైలు శిక్ష విధించడం గమనార్హం.

Tags:    

Similar News