టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ రేసులో తాను ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కుంతియాను కలిసి.. తనకు టీపీసీసీ పదవి ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అవుతానన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.