ఆరోగ్యశాఖ మంత్రికి పవర్స్ లేవు: జగ్గారెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేవలం కరోనా పాజిటివ్ కేసుల బులిటెన్ విడుదల కోసమే ఉన్నట్లు కన్పిస్తుందని, ఆయన దగ్గర ఎలాంటి అధికారాలు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ రాక ముందే రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. కోట్లు విడుదల చేస్తున్నాం అని జీవోలు వస్తున్నాయి కానీ ఎస్టీవోల్లో మాత్రం జమ కావడం లేదన్నారు. రైతుబంధు సాయం అడపా దడపా […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేవలం కరోనా పాజిటివ్ కేసుల బులిటెన్ విడుదల కోసమే ఉన్నట్లు కన్పిస్తుందని, ఆయన దగ్గర ఎలాంటి అధికారాలు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ రాక ముందే రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. కోట్లు విడుదల చేస్తున్నాం అని జీవోలు వస్తున్నాయి కానీ ఎస్టీవోల్లో మాత్రం జమ కావడం లేదన్నారు. రైతుబంధు సాయం అడపా దడపా జారీ చేస్తూ ప్రకటనలు మాత్రం ఘనంగా ఇచ్చుకుంటున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. పేద కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేయాలని, కరోనాకు ఇప్పట్లో మందు వచ్చే అవకాశాలు కన్పించడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ కింద అనేక జబ్బులకు వైద్యం అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య శ్రీ మొత్తం ఎత్తేశారని, ఈ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేయకుంటే ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.