8న జగనన్న విద్యా కానుక
దిశ,వెబ్ డెస్క్: ఏపీలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఈనెల 8న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న 42,34,322 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతీ కిట్‌లో మూడు జతల యూనిఫామ్‌లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఓ బ్యాగు ఉండనున్నాయి. కాగా బడి బయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, […]
దిశ,వెబ్ డెస్క్:
ఏపీలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఈనెల 8న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న 42,34,322 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతీ కిట్‌లో మూడు జతల యూనిఫామ్‌లు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఓ బ్యాగు ఉండనున్నాయి. కాగా బడి బయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, అభ్యసనా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా చేసేందుకే ఈ పథకాన్ని రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.