చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్.. అసెంబ్లీలో జగన్ సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాకపోవడంపై సెటైర్లు పేల్చారు. బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాలేదని, బీఏసీని కొంత ఆలస్యం చేసినా ఆయన రాలేకపోయారని విమర్శించారు. ఆయనకున్న కష్టం ఏంటో తనకైతే తెలియదని, చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడినట్టుందని మా వాళ్లు అంటున్నారని జగన్ చెప్పారు. ఆడవాళ్లకు మంచి జరగాలని భావిస్తున్న ప్రభుత్వం తమదని, ఈ రెండేన్నరేళ్లలో మహిళ […]
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాకపోవడంపై సెటైర్లు పేల్చారు. బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాలేదని, బీఏసీని కొంత ఆలస్యం చేసినా ఆయన రాలేకపోయారని విమర్శించారు. ఆయనకున్న కష్టం ఏంటో తనకైతే తెలియదని, చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడినట్టుందని మా వాళ్లు అంటున్నారని జగన్ చెప్పారు.
ఆడవాళ్లకు మంచి జరగాలని భావిస్తున్న ప్రభుత్వం తమదని, ఈ రెండేన్నరేళ్లలో మహిళ సాధికారతలో సువర్ణాధ్యాయం లిఖించామన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా కోటిమంది మహిళలకు లబ్ధి చేకూర్చామన్నారు. సున్నా వడ్డీ డబ్బులను గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని, సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నామని జగన్ తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా 3 లక్షల 40 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు. కేబినెట్‌లో మహిళలకు పెద్దపీట వేశామని, చరిత్రలో తొలిసారి ఎస్‌ఈసీగా మహిళను నియమించామన్నారు.