7న ఢిల్లీ పర్యటనకు జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 7న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వ్యాక్సిన్ కొరత, కరోనా కట్టడి, విభజన బిల్లులోని హామీలపై కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చించనున్నారు. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్ల విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ రాశారు. అయితే చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా.. ఒక బిడ్ కూడా దాఖలు కాలేదు. ఈ క్రమంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, రాష్ట్రానికి […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 7న సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వ్యాక్సిన్ కొరత, కరోనా కట్టడి, విభజన బిల్లులోని హామీలపై కేంద్ర మంత్రుల్ని కలిసి చర్చించనున్నారు. వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్ల విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ రాశారు. అయితే చాలా రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా.. ఒక బిడ్ కూడా దాఖలు కాలేదు. ఈ క్రమంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, రాష్ట్రానికి సంబంధించిన ఇతరత్రా అంశాలపై కేంద్ర పెద్దలతో జగన్ చర్చించే అవకాశాలున్నాయి. జగన్ పర్యటనకు సంబంధించి సీఎం కార్యాలయ వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి.