కోవిడ్ మందు కోసం జాక్ మా సాయం
దిశ, వెబ్‌డెస్క్ : చైనాను వణికిస్తున్న కోవిడ్ 19 (కరోనా) వైరస్‌ను అంతం చేయడానికి యాంటీవైరల్ డ్రగ్ కనిపెట్టడంలో ఆ దేశ టెక్ బిలియనీర్ జాక్ మా తన వంతు సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై కొలంబియా యూనివర్సిటీకి, జాక్ మాకి మధ్య ఒప్పందం కుదిరింది. జాక్ మా మొత్తంగా 15 మిలియన్ల యువాన్లు సాయం చేయబోతున్నారని రీసెర్చీ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ హో తెలిపారు. వుహాన్‌లో కోవిడ్ 19 విజృంభించిన నాటి […]
దిశ, వెబ్‌డెస్క్ :
చైనాను వణికిస్తున్న కోవిడ్ 19 (కరోనా) వైరస్‌ను అంతం చేయడానికి యాంటీవైరల్ డ్రగ్ కనిపెట్టడంలో ఆ దేశ టెక్ బిలియనీర్ జాక్ మా తన వంతు సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై కొలంబియా యూనివర్సిటీకి, జాక్ మాకి మధ్య ఒప్పందం కుదిరింది. జాక్ మా మొత్తంగా 15 మిలియన్ల యువాన్లు సాయం చేయబోతున్నారని రీసెర్చీ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ హో తెలిపారు.
వుహాన్‌లో కోవిడ్ 19 విజృంభించిన నాటి నుంచి కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు వైరస్ వ్యాప్తిని దగ్గరుండి పరీక్షిస్తున్నారు. దానికి మందు కనిపెట్టడానికి వైరాలజీ, మాలిక్యులర్ బయోలజీ, రసాయన శాస్త్ర పరిశోధకులతో ఒక బృందం కూడా తయారైంది. వీరి పరిశోధనకే జాక్ మా చేయూతనిస్తున్నారు. ఇప్పటికీ కోవిడ్ 19 బారిన పడి ఇప్పటికే 2,236 మంది చనిపోగా, 75,465 మందికి వ్యాధి సోకినట్లు తెలుస్తోంది.
Read also..