తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన హైపర్ ఆది

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యాస, భాష సంస్కృతిని జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అవమానపరిచాడని.. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆది.. క్షమాపణలు చెప్పారు. తాను తెలంగాణ సంసృతీ సాంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు. అయినా.. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. తాను కావాలని చేయలేదని హైపర్‌ ఆది తెలిపారు. ఏపీ, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ మధ్య […]

Update: 2021-06-15 11:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ యాస, భాష సంస్కృతిని జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అవమానపరిచాడని.. బతుకమ్మ, గౌరమ్మలను కించపరుస్తూ మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆది.. క్షమాపణలు చెప్పారు. తాను తెలంగాణ సంసృతీ సాంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు. అయినా.. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. తాను కావాలని చేయలేదని హైపర్‌ ఆది తెలిపారు. ఏపీ, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ మధ్య లేవని హైపర్‌ ఆది వెల్లడించారు. అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటామన్నారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానం వల్లే తాము ఇంత వాళ్లము అయ్యామని హైపర్‌ ఆది అభిప్రాయపడ్డారు. షోలో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నామని హైపర్‌ ఆది అన్నారు.

Tags:    

Similar News