ఐటీసీ, ఆమ్వే భాగస్వామ్యం 'బీ-నేచురల్ ప్లస్'

దిశ, సెంట్రల్ డెస్క్ : ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ..ఉత్పత్తులను నేరుగా విక్రయించే ఆమ్వేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీ-నేచురల్ బ్రాండ్‌లో కొత్త శ్రేణి పానీయాలను పంపిణీ చేసేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు వెల్లడించాయి. బీ-నేచురల్ ప్లస్ బ్రాండ్‌ను రెండు ఫ్లేవర్లలో విడుదల చేశారు. దీని ధరను లీటరుకు రూ. 130 గా నిర్ణయించారు. దీన్ని ఆమ్వే పరిమిత కాలంపాటు విక్రయిస్తుందని ఐటీసీ తెలిపింది. ఐటీసీకి చెందిన లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ దీన్ని […]

Update: 2020-05-29 06:52 GMT

దిశ, సెంట్రల్ డెస్క్ : ఎఫ్ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ..ఉత్పత్తులను నేరుగా విక్రయించే ఆమ్వేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీ-నేచురల్ బ్రాండ్‌లో కొత్త శ్రేణి పానీయాలను పంపిణీ చేసేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు వెల్లడించాయి. బీ-నేచురల్ ప్లస్ బ్రాండ్‌ను రెండు ఫ్లేవర్లలో విడుదల చేశారు. దీని ధరను లీటరుకు రూ. 130 గా నిర్ణయించారు. దీన్ని ఆమ్వే పరిమిత కాలంపాటు విక్రయిస్తుందని ఐటీసీ తెలిపింది. ఐటీసీకి చెందిన లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ దీన్ని అభివృద్ధి చేసింది.

వేసవిలో రోగనిరోధక శక్తిని కలిగి ఉండేందుకు, ఇతర బ్రాండ్‌లకు పోటీగా దీన్ని మార్కెట్లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఏప్రిల్-మే మధ్య కాలంలో లాక్‌డౌన్ వల్ల జ్యూస్ విభాగానికి సంబంధించి సరఫరా వ్యవస్థ దెబ్బతింది. వేసవి కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకేజ్‌డ్ పానియాన్ని తీసుకొచ్చామని’ ఐటీసీ లిమిటెడ్, డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ తెలిపారు. గతేడాది కాలంగా ఆమ్వేతో చర్చలు జరుపుతున్నామని ఆయన ప్రస్తావించారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల అమ్మకాలు సుమారు 40 శాతం వరకు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్‌లో వెతికేవారు ఆరు రెట్లు పెరిగారని ఇటీవల గూగుల్ నివేదిక పేర్కొంది. ‘ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగిన ఈ సమయంలో ఐటీసీతో సహకారం మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి తోడ్పాటు ఇస్తుందని’ ఆమ్వే ఇండియా సీఈవో అన్షు బుధ్‌రాజా చెప్పారు. ప్యాకేజ్డ్ జ్యూస్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ .2500 కోట్లు ఉంది.

Tags:    

Similar News