షూటింగ్‌కు ఓకే.. థియేటర్లకు నో
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో లాక్‌డౌన్ నుంచి సినిమా రంగానికి పాక్షిక మినహాయింపు లభించింది. లాక్‌డౌన్ సడలింపులలోకి ఎట్టకేలకు సినిమా రంగాన్ని చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు, టీవీ సీరియళ్లు మిగతాది పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో లాక్‌డౌన్ నుంచి సినిమా రంగానికి పాక్షిక మినహాయింపు లభించింది. లాక్‌డౌన్ సడలింపులలోకి ఎట్టకేలకు సినిమా రంగాన్ని చేరుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు, టీవీ సీరియళ్లు మిగతాది పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ టైంలో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్‌ను విడుదల చేసింది. సినిమా హాళ్లు, థియేటర్లు మాత్రం తదుపరి ఆదేశాలిచ్చేదాకా మూసే ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.