వారికి ఉద్యోగం ఇప్పించింది ఈటల కాదు

దిశ, హుజురాబాద్ : హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్‌కు, అతని కుటుంబ సభ్యులకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పించింది ఈటల రాజేందర్ కాదని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్ యాదవ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ యాదవ్‌కు ఈటల హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం కల్పించారనడంలో వాస్తవం లేదన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు […]

Update: 2021-09-30 09:17 GMT

దిశ, హుజురాబాద్ : హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్‌కు, అతని కుటుంబ సభ్యులకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పించింది ఈటల రాజేందర్ కాదని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ప్రవీణ్ యాదవ్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవీణ్ యాదవ్‌కు ఈటల హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం కల్పించారనడంలో వాస్తవం లేదన్నారు. కొంతమంది బీజేపీ నాయకులు యాదవ సోదరులతో.. కలసి ఈటల రాజేందర్ ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకున్నాడని తప్పుడు ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కెనాల్, ట్రాన్స్ఫార్మర్ కింద వ్యవసాయ భూమి పోవడంతో అప్పుడు పదవిలో ఉన్న సర్పంచ్ రావుల భాస్కర్ రెడ్డి ప్రవీణ్ యాదవుకు సహకారం చేశారని వెల్లడించారు.

ఇంజనీరింగులో పట్టభద్తుడైన ప్రవీణ్ యాదవ్‌కు కంప్యూటర్‌పై నైపుణ్యం ఉందని, కరీంనగర్‌లోని వారధి సొసైటీలో పేరు నమోదు చేసుకోగా కేసీఆర్ కిట్ విభాగంలో హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగం వచ్చిందన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడున్న సూపరింటెండెంట్ సిజేరియన్ ద్వారా డెలివరీ అయిన కేసులను నార్మల్ డెలివరీగా రికార్డు చేయాలని ఒత్తిడి తెచ్చారని దీనికి ప్రవీణ్ యాదవ్ ఒప్పుకోకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. అకారణంగా కేసులు పెట్టి వేధించడంతో మానసిక వేదనకు గురిచేసి మృతి చెందడానికి ఈటల, ఆసుపత్రి సూపరెండెండెంట్ కారణమయ్యారని ఆరోపించారు.

ప్రవీణ్ యాదవ్ ను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత మళ్లీ ఉద్యోగంలో పెట్టించాలని అతని మామ కుటుంబ సభ్యులు ఈటల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నా ఎలాంటి సహాయం చేయలేదన్నారు. ప్రవీణ్ యాదవ్ కు ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్ట్ ధిక్కరణ కేసు నడుస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పనిచేసినట్లు ఒప్పుకున్న ఈటల కనీసం ఆయన కుటుంభ సభ్యులను ఎందుకు పరామర్శించలేదన్నారు.వాస్తవాలు తెలుసుకోకుండా యాదవ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడడం భావ్యం కాదని జల్లు హితవు పలికారు. ఈ సమావేశంలో ప్రవీణ్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News