హైదరాబాద్‌లో మళ్లీ వర్షం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. ఐదురోజుల క్రితం కురిసిన వర్షం నుంచి కోలుకుంటున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఆదివారం సాయంత్రం మళ్లీ వర్షంతో ప్రజలు భయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది ఇళ్లలోకి నీరు చేరగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. ఐదురోజుల క్రితం కురిసిన వర్షం నుంచి కోలుకుంటున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురవడంతో పరిస్థితి మళ్లీ మొదటకు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఆదివారం సాయంత్రం మళ్లీ వర్షంతో ప్రజలు భయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది ఇళ్లలోకి నీరు చేరగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చందానగర్ ప్రాంతాల్లో వర్షం పడుతుండగా నగరం మొత్తాన్ని ముబ్బు కమ్మేసింది. వచ్చే మూడ్రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.