వచ్చే రెండు రోజులు వర్షాలు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని చెప్పారు. ఫలితంగా గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, పెద్దపల్లి, కరీంనగర్, మేడ్చల్ […]

Update: 2020-07-22 09:46 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని చెప్పారు. ఫలితంగా గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, పెద్దపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షం కురుస్తుందని వెల్లడించారు.

శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తాయని ప్రకటించారు. రాష్ట్రంలో బుధవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నల్గొండ, వికారాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్అర్బన్, సంగారెడ్డి, సిద్ధిపేట, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షం కురిసింది.

Tags:    

Similar News