కర్నాటకలో మసీదుల్లోకి అనుమతి
దిశ, వెబ్‌డెస్క్: యడ్డీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈద్ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు ముస్లింలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మసీదుల్లో ఖచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించాలని వెల్లడించింది. ఒకసారి మసీదుల్లో 50 మంది ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఇక, కర్నాటక రాజధాని బెంగళూరు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: యడ్డీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈద్ సందర్భంగా మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు ముస్లింలకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే మసీదుల్లో ఖచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించాలని వెల్లడించింది. ఒకసారి మసీదుల్లో 50 మంది ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించింది.
ఇక, కర్నాటక రాజధాని బెంగళూరు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో ఆదివారం సంపూర్ణ అష్ట దిగ్బంధనం అమలు చేస్తున్నారు. వచ్చే ఆదివారం (ఆగస్టు 2) వరకు ఆంక్షలు సడలించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.