పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: పాలిసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. చివరి తేది జూన్ 11న నిర్ణయించగా రూ.100 లేట్ ఫీజుతో జూన్ 13 వరకు అవకాశం కల్పించారు. తాత్కాల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రూ.300 లేట్ ఫీజుతో జూన్ 15 వరకు అవకాశం కల్పించారు. పరీక్షా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన 10 రోజులకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత […]
దిశ, తెలంగాణ బ్యూరో: పాలిసెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. చివరి తేది జూన్ 11న నిర్ణయించగా రూ.100 లేట్ ఫీజుతో జూన్ 13 వరకు అవకాశం కల్పించారు. తాత్కాల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రూ.300 లేట్ ఫీజుతో జూన్ 15 వరకు అవకాశం కల్పించారు. పరీక్షా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, పరీక్ష నిర్వహించిన 10 రోజులకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యకు అర్హులుగా తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా, డిప్లొమా ఎనిమల్ హస్బెడరీ, డిప్లొమా ఫిషరీస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రకటిచారు. విద్యార్థులు దరఖాస్తు సందేహల నివృత్తి కోసం 040-23222192 నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు.