కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే కామారెడ్డి పర్యటన చేశారా..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నార్సింగిలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, కొంత కబ్జా చేసి తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బదాలాయించుకునేందుకు యత్నిస్తున్నాడని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నార్సింగి నుంచి అచ్చంగా 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో పేదలకు సర్కారు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నార్సింగిలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, కొంత కబ్జా చేసి తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బదాలాయించుకునేందుకు యత్నిస్తున్నాడని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నార్సింగి నుంచి అచ్చంగా 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలో పేదలకు సర్కారు ఇచ్చిన భూములకు ఇప్పుడు క్రమబద్ధీకరణ యత్నాలు జరగుతున్నా చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్ర చర్చనీయాంశమైంది. అది కూడా నెల రోజులుగా జరుగుతున్న ఈ తంతు సీఎం కేసీఆర్ ఈ నెల 20న కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన తరువాత జోరందుకోవడంతో సర్కారు పేదలకు కేటాయించిన భూములకు ఎన్‌ఓసీల ప్రక్రియ జరుగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలకు దశాబ్ధాల క్రితం కేటాయించిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించు పనులు కామారెడ్డి జిల్లాలో జోరుగా జరుగుతున్నాయి. గత నెల రోజులుగా కామారెడ్డి జిల్లా కేంద్రం చుట్టు ప్రక్కల గ్రామాలైన నర్సన్నపల్లి, పొందుర్తి, పాతరాజంపేట్, జంగంపల్లి, అంతంపల్లి, భవానిపేట్ తదితర శివారు ప్రాంతాల్లో కనీసం 75 నుంచి 100 ఎకరాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసిన వెంటనే ఊపందుకుంది. పేదల ఆర్థిక అవసరాలను, పేదరికంను అసరాగా చేసుకొని అగ్గువ సగ్గువకు కోట్టేసిన బడా బాబులు, నేతలు వాటిని రిజిస్ట్రేషన్‌ల పరంగా కూడా మార్పులు చేర్పులు చేసేసుకున్నారు. ఇప్పుడు మాత్రం ధరణితో పాటు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ (లావుణి) పట్టా భూములను మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకు వారు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లను సాధించుకునే పనిలో పడినట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లా కావడంతో చుట్టు ప్రక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దానికి తోడు కామారెడ్డి జిల్లా కేంద్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాంతీయ రవాణా కారీడర్ కు చేంతనే అ భూములు ఉండటంతో పేదల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు, పోలిటికల్ లీడర్లు అందరు వాటిని క్రమబద్ధీకరించుకునే పనిలో పడ్డారు. కామారెడ్డి జిల్లాలో పారిశ్రామీక కారీడార్ కు అవకాశం ఉండటంతో పాటు వాణిజ్య సోబగులు ఉన్న కామారెడ్డి భూములకు భవిష్యత్తులో భూముల ధరలు ఆకాశాన్ని అందడం ఖాయం కావడంతో భూములకు యజామానులు అయ్యేందుకు అ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా అందరు కుడబలుక్కుని ప్రయత్నాలు చేయడం గమనార్హం.
ప్రభుత్వాలు మారినా ఆ భూముల తాలూకూ ఎన్ఓసిలు మాత్రం మొన్నటి వరకు తెచ్చుకోవడం సాధ్యం కాదు. 1975 అసైన్డ్ చట్టం క్రింద కేటాయించిన భూములను కేవలం పట్టాలు పొందినవారు అనుభవించడం, వారి వారసులకు సంక్రమించడం మినహ ఎలాంటి మార్పు ఉండదని చట్టం చెబుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ వంటి రాజకీయ ఉద్దండుడికే పదవికి ఎసరు తెచ్చాయి అసైన్డ్ భూములు. కాని కామారెడ్డి రెవెన్యూ యంత్రాంగం మాత్రం డిపరేంట్. పెద్ధలను, అధికారులను, లీడర్లను పేదలుగా చూయించి వారికి వందల ఎకరాలు కట్టబెట్టారు గతంలో.
కానీ సంబంధిత భూములను రికార్డుల నుంచి బదాలాయించిడం సాధ్యం కాలేదు. తక్కువ ధరకు కొట్టేసిన బడా బాబులు ఇప్పటికి ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధులను కుడా పొందుతున్నారు. ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రం, పారీశ్రామీక కారీడార్, రిజినల్ రింగ్ రోడ్డులకు దగ్గరగా ఉన్న భూములను డేవలప్ చేద్దామంటే పూర్వపు రికార్డులలో అసైన్డ్ అని వస్తుండటంతో వాటిని డేవలప్ చేయ్యాలన్న, రుణాలు పోందాలన్న సాధ్యం కాకపోవడంతో వాటికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లు పోందడం కోసం వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గతంలో కామారెడ్డిలో పనిచేసిన వివాదస్పద అధికారి, స్వయంగా జిల్లా కేంద్రంలో తిష్ట వేసి మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత భూములు వ్యాపార వర్గాలు, పోలిటికల్ లీడర్ల అధీనంలో ఉండటం అందులో సింహభాగం అధికార పార్టీకి చెందిన వారివి ఉండటంతో ఈ ప్రక్రియను గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారని సమాచారం. ఎన్ఓసీల వ్యవహరం చాలా మంది అధికారుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. అందుకే కామారెడ్డి రెవెన్యూ అధికారులు మొన్నటి దాకా వెనుకంజ వేశారు కూడా. అసైన్డ్ భూములను లబ్ధిదారుల వారసులు అనుభవించాలి తప్ప, కొన్నామని అంటే, ఇతరుల పేరిట మార్చితే ఉద్యోగానికి ఎసరొస్తుందని మొన్నటి దాకా భయపడ్డారు. కానీ పెద్ద సార్ కేసీఆర్ కామారెడ్డి వచ్చి వెళ్లంగానే అక్కడి అధికారులకు రెక్కలు వచ్చాయి.
ప్రభుత్వం పేదలకు పంచిపెట్టిన భూములను ఇతరులకు మార్చడమే నేరమంటే, ఘనత వహించిన కామారెడ్డి రెవెన్యూ అధికారులు ఏకంగా ఎన్‌ఓసీ లు జారీచేసే పనిలో తల మునకయ్యారు. స్వాత్రంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు సంబంధించిన ప్రభుత్వం ఉచితంగా పంచిపెట్టిన భూములకు మాత్రమే ఎన్ఓసీ జారీచేసే నిబంధన ఉంది. ఇంకా ఏ రకమైన భూములకు ఎన్ఓసీ లు జారీ చేయడానికి చట్టం అంగీకరించదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 300 వరకు ఎన్ఓసీల దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో వచ్చినవి ఉండగా అందులో సింహభాగం కామారెడ్డి పట్టణ శివారుల గ్రామాలలో పేదలకు పంచిన భూములకు సంబంధించినవి ఉండటం విశేషం. ఈ వ్యవహరంలో లక్షల రూపాయాలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఎప్పుడో ఒకప్పుడు ఎన్ఓసీ భూముల వ్యవహరం బట్టబయలు కావడం త్వరలో జరుగుతుంది అని రెవిన్యూ, సర్వే శాఖలు పేర్కోంటున్నాయి.
పేదలకు ఇచ్చిన భూముల క్రమబద్ధీకరణను అడ్డుకుంటాం
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు భూములను పంచిపెట్టింది. వాటితో చాలామంది పేదలు ఆర్ధికంగా, సామాజికంగా ఎదిగారు. కొందరు వ్యాపారులు, లీడర్లు పేదల నుంచి నయానో భయానోకు భూములను కొనుగోలు చేసి క్రయ విక్రయాలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెబుతుంది. పేదలకు కేటాయించిన భూములు వారికే చెందాలి. వాటిని బదాలాయిస్తే మాత్రం ఉరుకోం. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పేదల పక్షాన అందోళన చేస్తాం.
-కైలాస్ శ్రీనివాస్.. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు