అతడితో.. ఐరా ‘లవ్ స్టోరీ’?

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫొటోలు, వీడియోలు ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ బ్యూటీ, ఇటీవలే తన మానసిక సమస్యలు గురించి కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త రిలేషన్‌షిప్ గురించి ప్రపంచానికి బహిర్గతంగా చెప్పకపోయినా, తన ఫొటోలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని జాతీయ మీడియా అంటోంది. ఐరా ఖాన్ ‘లవ్‌స్టోరీ’ బీటౌన్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. […]

Update: 2020-11-25 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన ఫొటోలు, వీడియోలు ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ బ్యూటీ, ఇటీవలే తన మానసిక సమస్యలు గురించి కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. తన కొత్త రిలేషన్‌షిప్ గురించి ప్రపంచానికి బహిర్గతంగా చెప్పకపోయినా, తన ఫొటోలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని జాతీయ మీడియా అంటోంది.

ఐరా ఖాన్ ‘లవ్‌స్టోరీ’ బీటౌన్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జిమ్ ట్రైనర్ నుపూర్ శిఖారెతో ఐరా ప్రేమలో పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నుపుర్ అమీర్‌కు ఫిట్‌నెస్ కోచ్‌గా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ సమయంలో ఐరాతో కూడా వర్కవుట్లు చేయించాడు. ఆ సమయంలోనే ఐరా, నుపూర్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. మహాబలేశ్వర్‌లోని ఆమీర్ ఫామ్‌హౌస్‌లో ఈ జంట స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నట్లు సమాచారం. నుపూర్ తల్లి రీనా దత్తకు ఐరాను పరిచయం చేసినట్లు సమాచారం. ఐరా దీనిమీద ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News