IPL 2023: ఆర్సీబీ కెప్టెన్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా..

IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అరుదైన ఘనత సాధించాడు.

Update: 2023-05-14 12:10 GMT
IPL 2023: ఆర్సీబీ కెప్టెన్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టడంతో.. ఐపీఎల్‌లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో విదేశీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. డుప్లెసిస్‌ 128 మ్యాచ్‌ల్లో 4వేల పరుగుల మార్క్‌ను రీచ్ అయ్యాడు.

డుప్లెసిస్‌ కంటే ముందు ముగ్గురు బ్యాటర్లు ఈ ఫీట్‌ సాధించారు. మొదటిస్థానంలో డేవిడ్‌ వార్నర్‌ 174 మ్యాచ్‌ల్లో 6,265 పరుగులతో ఉండగా.. 184 మ్యాచ్‌ల్లో 5,162 రన్స్‌తో ఏబీ డివిలియర్స్‌ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్ట్ ఇండిస్ బ్యాటర్ క్రిస్‌గేల్‌ 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

IPL 2023: రాణించిన డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్.. రాజస్తాన్ టార్గెట్ ఇదే 

Tags:    

Similar News