BREAKING: పొదుపుగా బౌలింగ్ చేస్తున్న సన్‌రైజర్స్ బౌలర్లు.. ఎదురీదుతున్న లక్నో జట్టు
ఐపీఎల్-2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ చక్కటి ఆరంభాన్ని ఇవ్వడంలో విఫలయ్యారు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డికాక్ కేవలం 2 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 29 పరుగులు చేసిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన క్రునాల్ పాండ్యా 21 బంతుల్లో 24 పరుగులు చేసి కమిన్స్ విసిరిన చక్కని త్రో వల్ల రన్ అవుట్ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో 4 కీలక వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం నికొలస్ పూరన్ 12 బంతుల్లో 18 పరుగులు, అయుష్ బదోని 14 బంతుల్లో 23 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఇక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు నేలకూల్చాడు. కెప్టెన్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు.