ఐపీఎల్ బెట్టింగ్స్ జోరు..!

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన బెట్టింగ్.. ఇప్పుడు పచ్చని పల్లెల్లోకి చేరింది. వాస్తవానికి అత్యాధునిక సాంకేతిక చేరువవుతుందని సంబర పడాలో.. లేక దాన్ని కలిగే అనర్థాలను చూసి ఏడవాలో తెలియని పరిస్థితి. మంచి పనులకు ఉపయోగించాల్సిన సాంకేతికతను కొంతమంది అక్రమార్కులు తమ స్వార్థం కోసం వాడుకుంటూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ టోర్నీ కొందరికీ వినోదాన్ని పంచుతుంటే.. మరికొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. బెట్టింగ్ మోజులో పడి అందిన కాడికి అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. […]

Update: 2020-09-22 21:06 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన బెట్టింగ్.. ఇప్పుడు పచ్చని పల్లెల్లోకి చేరింది. వాస్తవానికి అత్యాధునిక సాంకేతిక చేరువవుతుందని సంబర పడాలో.. లేక దాన్ని కలిగే అనర్థాలను చూసి ఏడవాలో తెలియని పరిస్థితి. మంచి పనులకు ఉపయోగించాల్సిన సాంకేతికతను కొంతమంది అక్రమార్కులు తమ స్వార్థం కోసం వాడుకుంటూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ టోర్నీ కొందరికీ వినోదాన్ని పంచుతుంటే.. మరికొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. బెట్టింగ్ మోజులో పడి అందిన కాడికి అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్నారు. అనంతరం ఆ అప్పులు తీర్చే మార్గం లేక.. ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. టోర్నీ మొదలయ్యిందో.. లేదో బెట్టింగ్ రాజుల జోరుగా పెరిగిపోయింది. తొలి మ్యాచ్‌కే ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.కోటికి పైగా బెట్టింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా ఐపీఎల్ టోర్నీపై జరుగుతున్న బెట్టింగ్ వ్యవహారంపై దిశ ప్రత్యేక కథనం..

కృష్ణానదిని అనుకుని ఉన్న హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బెట్టింగ్ జోరుగా సాగుతోం ది. ఓ ఉన్నతోద్యోగి కనుసన్నల్లో భారీగా ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోంది. పోలీసుల నుంచి అటాక్ జరిగినా.. మీడియాను మేనేజ్ చేయడంలో అంతా ఆ ఉన్నతోద్యోగిదే బాధ్యత. ప్రతి బాల్‌కు, వైడ్, నోబ్, ఫోర్, సిక్స్, మ్యాచ్ విన్నర్, వికెట్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా బెట్టింగ్ దశలు సాగుతుంటాయి. ఉదాహరణకు ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య ఆదివారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యా చ్‌లో ఢిల్లీ గెలుస్తుందని ఓ యువకుడు రూ.10 వేలు బెట్టింగ్ కాశాడు. ఢిల్లీనే గెలుపొందడం తో అతడికి రూ.17వేలు లాభం వచ్చింది. కానీ నిజానికి రూ.10వేలకు రూ.10వేలు అంటే రూ.20 వేలు అతడికి రావాలి. కానీ బెట్టింగ్ నిర్వాహకుడైన ఆ ఉన్నతోద్యోగికి రూ.3 వేలు కమిషన్ అన్నమాట. ఇలా రాత్రికి రాత్రే రూ.లక్షల్లో బెట్టింగ్ బిజినెస్ సాగుతోంది. ఆదివారం జరిగిన ఢిల్లీ, పంజాబ్ జట్ల మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.కోటికి పైగానే బెట్టింగ్ జరిగిందంటే అతిశయోక్తి కాదు.

సూర్యాపేటకు చెందిన నలుగురు వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సూర్యాపేట పట్టణ పోలీసు లు రంగంలోకి దిగారు. బెట్టింగ్ కాస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశా రు. వారి వద్ద నుంచి 2,500 రూపాయల నగ దు, నాలుగు సెల్‎ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యువత ఇలాంటి క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాస్తవానికి జిల్లాలో భారీ స్థాయి లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని వదిలేసి.. చాలా చిన్నస్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయడంపైన స్థానికులు పెదవి విరుస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాన్ని అనుకుని ఉన్న ఫౌంహౌస్‌ల్లో భారీగా బెట్టింగ్ ఏర్పాట్లు చేశారు. బయటకు ఎవ్వరికీ కనపడకుండా ఫాంహౌస్‌లో పల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి.. హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చి మధ్య రాత్రి వరకు ఎంజాయ్ చేసి వెళుతున్నారు. ఓ వైపు మద్యం మత్తు.. పక్కన అమ్మాయి లు.. చేతిలో సిగరేట్.. అంతే వారికి ఏం జరుగుతుందో తెలియకుండానే ఐదారు గంటల వ్యవధిలోనే రూ.లక్షలను పొగొట్టుకుంటున్నారు. కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు.. పోలీసులకు దొరక్కుండా ఎప్పుడు ఎక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని మ్యాచ్ మొదలయ్యేందుకు కేవలం గంట ముందు మాత్రమే సమాచారం చేరవేస్తారు. అప్పటికే జాతీయ రహదారి వెంట కార్లలో సిద్ధంగా ఉండి.. లొకేషన్ మేసెజ్ రాగానే యువత అక్కడ వాలిపోతున్నారు.

ఐపీల్ ప్రారంభమైన దృష్ట్యా బెట్టింగ్ జరుగకుండా గట్టి నిఘాను పెట్టినట్టు సూర్యాపేట ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగుల పేరుతో యువతను ప్రలోభాలకు గురిచేస్తే ఎంతటివారైన ఉపేక్షించేది లేదన్నారు. బెట్టింగులు పాల్పడుతూ నష్టపోవద్దు, బెట్టింగ్ అంటూ వచ్చే వారితో యువత జాగ్ర త్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్క డైనా బెట్టింగులకు పాల్ప డే వారి సమాచారం పోలీసులకు ఇస్తే నగదు బహుమతి అందిస్తామని అన్నారు. సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్స్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ 9346506767, జిల్లా వాట్సాప్ 9390564900 నంబలో సమాచారం ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News