అయోధ్య భూమిపూజకు సంగారెడ్డి సాధువు
దిశ, న్యూస్‌బ్యూరో: అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగ్రామ్ మహారాజ్‌కు ఆహ్వానం అందింది. అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఒక్కరికి మాత్రమే రాష్ట్రం నుంచి పాల్గొనే అవకాశం లభించింది. ఈ బాధ్యతలతో పాటు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయ పీఠాధిపతిగా కూడా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి తనొక్కరికి మాత్రమే ఈ ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారమే బయలుదేరడానికి […]
దిశ, న్యూస్‌బ్యూరో: అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగ్రామ్ మహారాజ్‌కు ఆహ్వానం అందింది. అఖిల భారత సాధుసంతుల రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయన ఒక్కరికి మాత్రమే రాష్ట్రం నుంచి పాల్గొనే అవకాశం లభించింది. ఈ బాధ్యతలతో పాటు నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ ఆలయ పీఠాధిపతిగా కూడా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి తనొక్కరికి మాత్రమే ఈ ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి సోమవారమే బయలుదేరడానికి విమాన టిక్కెట్లను సైతం రామమందిర నిర్మాణ నిర్వాహకులు పంపినట్లు సంగ్రామ్ మహరాజ్ వెల్లడించారు.
గతంలో కరసేవ, రామజ్యోతి, శిలాన్యాస్ లాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 5న జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు మరో 50 మంది సాధు
సంతులు కూడా హాజరవుతున్నట్లు తెలిపారు.