మైనారిటీ స్కూల్, కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ, న‌ర్సాపూర్ : న‌ర్సాపూర్ ప‌ట్ట‌ణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కళ‌శాల‌లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ధ‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు నర్సాపూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ బుధ‌వారం నాడు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో 5, 6,7వ తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ లో ప్రవేశాలకు ఆన్లైన్లో www.tmreis.telangana.gov.in మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి […]

Update: 2021-05-12 06:43 GMT

దిశ, న‌ర్సాపూర్ : న‌ర్సాపూర్ ప‌ట్ట‌ణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కళ‌శాల‌లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ధ‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు నర్సాపూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ బుధ‌వారం నాడు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో 5, 6,7వ తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ లో ప్రవేశాలకు ఆన్లైన్లో www.tmreis.telangana.gov.in మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తరగతి లో 80 సీట్లకుగాను ముస్లింలకు 51, ఇతర మైనారిటీలకు 9, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, బీసీలకు 10, ఓసీలకు 2 చొప్పున సీట్లు కేటాయించినట్లు తెలిపారు. 6,7వ తరగతులకు పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయన్నారు. ఇంటర్ ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లకుగాను ముస్లింలకు 52, ఇతర మైనారిటీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీలకు 4, బీసీలకు10, ఓసీలకు 2సీట్లు కేటాయించామన్నారు. అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఈ నెల 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి. ప్రభాకర్ సూచించారు.

Tags:    

Similar News