పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, మేడ్చల్: జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బి.బలరామారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 26, 2021 ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారని తెలిపారు. కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ తదితర రంగాలలో […]
దిశ, మేడ్చల్: జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బి.బలరామారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జనవరి 26, 2021 ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందజేస్తారని తెలిపారు. కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ తదితర రంగాలలో చేసిన కృషిని 800 పదాలకు మించకుండా రాసి, జూన్ 20లోపు జిల్లా కలెక్టరేట్‌లోని యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు www.padmawards.gov.in వెబ్ సైట్ చూడాలని సూచించారు. అభ్యర్థులు 2 సెట్ల దరఖాస్తులతోపాటు సంబంధిత పేపర్ కట్టింగులు ఫొటోలు జత చేయాలని కోరారు.