మార్కెట్ల నష్టం రూ. 8 లక్షల కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. దీన్ని అధిగమించేందుకు చమురు ధరలను తగ్గించాలని నిర్ణయం సౌదీ తీసుకుంది. దీనికి రష్యా ఒప్పుకోలేదు. దీంతో, చమురు ధరలను తగ్గించే అంశంలో సౌదీ, రష్యా మధ్య పెట్రోల్ వాణిజ్యం భగ్గుమంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కుప్పకూలడంతో పెట్టుబడిదారులు మధ్యాహ్నానికి రూ. 7.72 లక్షల కోట్లను కోల్పోయారు. కరోనా వైరస్ ఆందోళనలు పెరుగుతుండటంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ. 136.59 […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చమురుకు భారీగా డిమాండ్ తగ్గింది. దీన్ని అధిగమించేందుకు చమురు ధరలను తగ్గించాలని నిర్ణయం సౌదీ తీసుకుంది. దీనికి రష్యా ఒప్పుకోలేదు. దీంతో, చమురు ధరలను తగ్గించే అంశంలో సౌదీ, రష్యా మధ్య పెట్రోల్ వాణిజ్యం భగ్గుమంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు కుప్పకూలడంతో పెట్టుబడిదారులు మధ్యాహ్నానికి రూ. 7.72 లక్షల కోట్లను కోల్పోయారు.
కరోనా వైరస్ ఆందోళనలు పెరుగుతుండటంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ. 136.59 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సేక్స్ ఏకంగా 2400 పాయింట్ల వరకూ పతనాన్ని చూసింది. నిఫ్టీ 6 శాతం మేర దిగజారింది. దేశీయ సూచీలు విపరీతమైన అమ్మకపు ఒత్తిడిని చూడ్డంతో నిఫ్టీ 6 శాతం క్షీణించి 656 పాయింట్ల వరకూ పడిపోయింది. ఇక, అంతర్జాతీయ వాణిజ్యంలో చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో దేశీయ సంస్థలు బీపీసీఎల్, హెచ్‌సీఎల్, ఇండియన్ ఆయిల్ షేర్ ధరలు 13 శాతం పెరిగాయి.
Tags: sensex, nifty, stock market, Saudi Arabia Cuts Oil Price, Russia, Coronavirus Cases, Market Capitalisation, Coronavirus Concerns