పెట్టుబడిదారుల ప్రయెజనాలు ఇక సురక్షితం
దిశ, వెబ్‌డెస్క్ : సెక్యూరిటీల మార్కెట్‌లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్ చార్టర్‌ను ప్రవేశపెట్టింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, మార్కెట్ నష్టాల గురించి అవగాహన కల్పించడం ఇన్వెస్టర్ చార్టర్ లక్ష్యం. మార్కెట్లో పెట్టుబడికి ఇన్వెస్టర్లు చేయవలసినవి, చేయకూడనివి, ఆఫర్‌ల ద్వారా మోసాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులను హెచ్చరించడం, న్యాయపరమైన సమస్యల పరిష్కారం మెుదలైన వాటి గురించి చార్టర్ పేర్కొంటుంది. స్కోర్స్ పోర్టల్‌లో స్వీకరించిన పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సెబీ […]
దిశ, వెబ్‌డెస్క్ : సెక్యూరిటీల మార్కెట్‌లో పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్ చార్టర్‌ను ప్రవేశపెట్టింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, మార్కెట్ నష్టాల గురించి అవగాహన కల్పించడం ఇన్వెస్టర్ చార్టర్ లక్ష్యం. మార్కెట్లో పెట్టుబడికి ఇన్వెస్టర్లు చేయవలసినవి, చేయకూడనివి, ఆఫర్‌ల ద్వారా మోసాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులను హెచ్చరించడం, న్యాయపరమైన సమస్యల పరిష్కారం మెుదలైన వాటి గురించి చార్టర్ పేర్కొంటుంది.
స్కోర్స్ పోర్టల్‌లో స్వీకరించిన పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను సెబీ వెబ్‌సైట్‌లో ప్రతినెల ప్రచురిస్తుంది.‘SEBI తన పోర్టల్ స్కోర్లు ద్వారా ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. సెబీ నియంత్రణలో ఉన్న అన్ని మధ్యవర్తులు/ఎంటీటీలు జనవరి 2022 నుంచి సెబీ పేర్కొన్న ఫార్మాట్‌లో తమ వెబ్‌సైట్లలో తమకు స్వీకరించిన పెట్టుబడిదారుల పరిష్కారానికి తీసుకున్న సగటు సమయాన్ని వెల్లడించవలసి ఉంటుంది.’ అని పేర్కొంది. పెట్టుబడిదారులకు మార్కెట్‌లో న్యాయమైన, పారదర్శకమైన, సురక్షితమైన పెట్టుబడి పెట్టడానికి సహాయం చేయడానికి, ఇన్వెస్టర్లకు వాళ్ల హక్కులు తెలియజేయడానికి ఈ చార్టర్‌ను ప్రవేశపెట్టినట్లు SEBI తెలిపింది.