కరోనాతో కాంగ్రెస్ నాయకుడు మృతి

దిశప్రతినిధి, నిజామాబాద్ : ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు మోటడీ వెంకటేశ్వర్లు (వెంకులు ) కరోనాతో మృతి చెందారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజామాబాద్ నగరానికి చెందిన వెంకటేశ్వర్లకు వారం రోజుల కందట కరోనా పాజిటివ్ సోకింది. ప్లాస్మా వైద్యం చేయించుకున్న ఫలితం దక్కలేదు. ఆయన ఐఎన్‌టీ‌యూసీకి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూనే.. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి గా ఉన్నారు. అంతేకాకుండా […]

Update: 2020-07-22 22:26 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకులు మోటడీ వెంకటేశ్వర్లు (వెంకులు ) కరోనాతో మృతి చెందారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నిజామాబాద్ నగరానికి చెందిన వెంకటేశ్వర్లకు వారం రోజుల కందట కరోనా పాజిటివ్ సోకింది. ప్లాస్మా వైద్యం చేయించుకున్న ఫలితం దక్కలేదు. ఆయన ఐఎన్‌టీ‌యూసీకి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూనే.. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి గా ఉన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఈయన వియ్యంకులు. ఎమ్మెల్సీ ఆకుల లలితకు దగ్గరి బంధువు. వెంకులు మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News