ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు..
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించేందుకు గడువును పొడిగిస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గురువారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇంటర్ పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఫిబ్రవరి 22 వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో మార్చి ఒకటి వరకూ, రూ.500 ఫైన్‌తో మార్చి 8 వరకూ, రూ. వెయ్యి ఫైన్‌తో 15వ తేదీ వరకూ, […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజులు చెల్లించేందుకు గడువును పొడిగిస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గురువారం ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇంటర్ పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఫిబ్రవరి 22 వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో మార్చి ఒకటి వరకూ, రూ.500 ఫైన్‌తో మార్చి 8 వరకూ, రూ. వెయ్యి ఫైన్‌తో 15వ తేదీ వరకూ, రూ. రెండు వేల ఫైన్‌తో మార్చి 22 వరకూ అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు. కళాశాలల యాజమాన్యాలు ట్యూషన్, పరీక్ష ఫీజులకు లింక్ పెట్టొద్దని, ఎటువంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజులను విద్యార్థుల నుంచి తీసుకోవాలని ఆయన సూచించారు.