స్టూడెంట్స్ బీ అలర్ట్ : ఇంటర్ ఫలితాలపై విద్యాశాఖ మంత్రి క్లారిటీ..

దిశ, వెబ్‌డెస్క్ : విద్యాసంస్థల ప్రారంభం, పరీక్షా ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వచ్చే వారంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే, ఈ అకాడమిక్ ఇయర్‌లో ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో.46ను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల విన్నపం […]

Update: 2021-06-21 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విద్యాసంస్థల ప్రారంభం, పరీక్షా ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వచ్చే వారంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అయితే, ఈ అకాడమిక్ ఇయర్‌లో ఫీజుల విషయంలో గతంలో ఇచ్చిన జీవో.46ను అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల విన్నపం మేరకు ఫీజుల తగ్గింపు కోసం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈనెల 25 నుంచి టీచర్లు పాఠశాలలకు రావాలని సూచించారు. కొవిడ్ మూలాన భయపడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్‌ను కోరుతామన్నారు. ఈ విషయంలో మరోసారి మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.

Tags:    

Similar News