ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులకు ముహూర్తం ఫిక్స్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో విద్యాసంవత్సరాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా తరగతులు ఈనెల 16 నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ […]

Update: 2021-08-18 06:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో విద్యాసంవత్సరాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు కూడా తరగతులు ఈనెల 16 నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 188 పని దినాలు ఉండగా.. రెండో శనివారాల్లో కూడా కాలేజీలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్‌లో పేర్కొంది. 2022 ఏప్రిల్ 23 వరకు కళాశాలలు కొనసాగనున్నట్లు తెలిపింది. అయితే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌ను మే చివరి వారంలో నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. అటు ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా పేర్కొంది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.

Tags:    

Similar News