ఇంటర్ తరగతులపై కీలక ఉత్తర్వులు..
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ తరగతుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ క్లాసులు జరపాలని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఇవి టీశాట్, దూరదర్శన్ ద్వారా నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే ఈనెల 27 నుంచి అధ్యాపకులు కాలేజీలకు హాజరుకావాలంటూ ప్రభుత్వం […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ తరగతుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ క్లాసులు జరపాలని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఇవి టీశాట్, దూరదర్శన్ ద్వారా నిర్వహించనున్నట్లు సమాచారం.
అలాగే డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే ఈనెల 27 నుంచి అధ్యాపకులు కాలేజీలకు హాజరుకావాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటికే కామన్ ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. యూజీ, పీజీ పరీక్షల తేదీలపై కూడా త్వరలోనే ఓ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.