నీ భర్తను చంపేస్తున్నాం.. చెల్లెలికి ఫోన్ చేసి

దిశ,వెబ్ డెస్క్: చెల్లెలు కులాంతర వివాహం చేసుకుంది. ఆ వివాహం ఆమె అన్నలకు నచ్చలేదు. దీంతో ఎలాగైనా బామ్మర్దిని హత మార్చాలని కుట్ర చేశారు. పెళ్లి చేసుకుంటే చేసుకున్నారలే సంతోషంగా ఉండండి అంటూ అత్తమామలు దీవించారు. కానీ బావలు మాత్రం కోపంతో లోలోపల రగిలిపోయారు. బామ్మర్ధిని హత్య చేయాలని ప్లాన్‌వేశారు. ప్లాన్ ప్రకారం పట్టపగలే అందరూ చూస్తుండగానే బాధితుణ్ని హతమార్చారు. అక్కడి నుంచి పరారయ్యారు. హర్యానాకు చెందిన నీరజ్‌ (23), ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లిచేసుకున్నారు. కానీ […]

Update: 2021-01-03 00:56 GMT

దిశ,వెబ్ డెస్క్: చెల్లెలు కులాంతర వివాహం చేసుకుంది. ఆ వివాహం ఆమె అన్నలకు నచ్చలేదు. దీంతో ఎలాగైనా బామ్మర్దిని హత మార్చాలని కుట్ర చేశారు. పెళ్లి చేసుకుంటే చేసుకున్నారలే సంతోషంగా ఉండండి అంటూ అత్తమామలు దీవించారు. కానీ బావలు మాత్రం కోపంతో లోలోపల రగిలిపోయారు. బామ్మర్ధిని హత్య చేయాలని ప్లాన్‌వేశారు. ప్లాన్ ప్రకారం పట్టపగలే అందరూ చూస్తుండగానే బాధితుణ్ని హతమార్చారు. అక్కడి నుంచి పరారయ్యారు.

హర్యానాకు చెందిన నీరజ్‌ (23), ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లిచేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి ప్రేమపెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఊరిపెద్దలు రాజీ కుదిర్చారు. అమ్మాయి తల్లిదంద్రులు ప్రేమ వివాహానికి మద్దతిచ్చారు. ఆమె అన్నలు అందుకు ఒప్పుకోలేదు. రోజులు గడుస్తున్నా నిందితుల నుంచి బాధితుడికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మాట్లాడాలని పిలిచి మరీ దాడికి తెగబడ్డారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నీరజ్‌ను అందరూ చూస్తుండగానే పానిపట్ కూరగాయల మార్కెట్‌లో డజను సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరరాయ్యారు. ఈ దారుణానికి ముందే కొన్ని నిమిషాలు ముందు నీరజ్‌ భార్యకు ఫోన్‌ చేసి మరీ త్వరలోనే ఏడుస్తావంటూ బెదిరించారనీ నీరజ్‌ సోదరుడు జగదీష్‌ వాపోయారు.

తన అన్న-వదినలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారని, వారి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించినా.. తన వదిన అన్నలు పెళ్లికి అడ్డుచెప్పారని బాధితుడి తమ్ముడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించాడు. దారుణంపై సమచారం అందుకున్న డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News