కరోనా మరణాలకు బీమా విషయంలో సందేహాలొద్దు!
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 మహమ్మారి భయంతో ఇప్పటికే చాలామంది జీవిత బీమా పాలసీని కోరుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఇంట్లోనూ ఒక్కరికి జీవిత బీమా అనేది ప్రాథమిక అవసరంగా మారిందని బీమా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఇటీవల లాక్‌డౌన్ వల్ల వినియోగదారులకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు జీవిత బీమా రంగంలో అన్ని సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని జీవిత బీమా మండలి భావిస్తోంది. కోవిడ్-19 […]
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా అనేక దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్-19 మహమ్మారి భయంతో ఇప్పటికే చాలామంది జీవిత బీమా పాలసీని కోరుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఇంట్లోనూ ఒక్కరికి జీవిత బీమా అనేది ప్రాథమిక అవసరంగా మారిందని బీమా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఇటీవల లాక్‌డౌన్ వల్ల వినియోగదారులకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ఈ అడ్డంకులను అధిగమించేందుకు జీవిత బీమా రంగంలో అన్ని సంస్థలు తగిన చర్యలు తీసుకుంటున్నాయని జీవిత బీమా మండలి భావిస్తోంది.
కోవిడ్-19 వంటి మహమ్మారి వ్యాప్తించిన ఈ సంక్లిష్ట కాలంలో డెత్ క్లైమ్స్ వంటి సేవలను డిజిటల్ విభాగంలో అందిస్తున్నాయి. ఈ సమయంలో బీమా సంస్థలు కస్టమర్లకు అండగా ఉంటూ తగిన సహకారం అందించడానికి సిద్ధమయ్యాయి. వినియోగదారులకు వదంతులు చేరకుండా, వారి సందేహాలను తీరుస్తున్నామని జీవిత బీమా మండలి సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.
కరోనా వల్ల మరణించిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగవంతంగా పరిష్కరించడానికి బీమా సంస్థలు సిద్ధమవ్వాలని ఇటీవల జీవిత బీమా మండలి వెల్లడించింది. ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ రంగంలోని సంస్థలన్నీ ఈ ప్రక్రియను పూర్తీస్థాయి వేగాన్ని అందుకోవాలని ప్రకటించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితుల్లో డెత్ క్లైమ్స్‌కు ‘ఫోర్స్ మెజర్’ నిబంధన వర్తించే విధానం కరోనా మరణాల్లో వర్తించదని బీమా మండలి స్పష్టం చేసింది. ఈ అంశంలో స్పష్టత కొరవడి చాలామంది వినియోగదారులు బీమా సంస్థల ఆఫీసులను సంప్రదిస్తున్నారని దీన్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీమా సంస్థలు చెబుతున్నాయి. బీమా సంస్థలు వినియోగదారుల వద్దకు వెళ్లి సందేహాలను నివృత్తి చేయాలని బీమా మండలి సంస్థలకు ఆదేశాలిచ్చింది. అలాగే, లాక్‌డోఉన్ కారణంగా అన్ని రకాల కార్యకలాపలు నిలిచిపోవడం వల్ల ఏప్రిల్ నెల జీవిత బీమా పాలసీల ప్రీమియమ్‌లను చెల్లించేందుకు అదనంగా 30 రోజుల గడువు ఇస్తున్నామని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది.
Tags: Insurance, coronavirus, insurance sector